రాబోయే సార్వత్రిక ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించింది లోక్సత్తా పార్టీ. విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర సదస్సులో లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. ఉచితాలు ఇస్తే ప్రజల జీవితాలు మెరుగుపడవని జేపీ చెప్పారు. వాటికీ ఓ పరిమితి ఉండాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు ప్రకటించడం సరికాదన్నారు. ఇలాంటి ప్రక్రియకు తమ పార్టీ విరుద్ధమని చెప్పారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధిపై ఖర్చు చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఉద్యమ పార్టీగా ప్రజల ముందు తమ అజెండాను ప్రవేశపెట్టామన్న జేపీ... ఎన్నికల్లో పోటీ చేసేదీ లేనిదీ వచ్చే వారం నిర్థరిస్తామన్నారు.