ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఓట్లతో మార్పునకు నాంది పలకాలి: పవన్​కల్యాణ్​ - జనసేన

బీఎస్పీ అధినేత్రి మాయావతి... కుల వ్యవస్థ ప్రభావం బలంగా ఉండే ఉత్తరప్రదేశ్‌ నుంచి నాలుగుసార్లు సీఎం కావడం ఆమె నాయకత్వ గొప్పతనాన్ని చాటుతుందన్నారు పవన్ కల్యాణ్. విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లో బీఎస్పీ, జనసేన బహిరంగ సభకు మాయావతితో కలిసి హాజరైన జనసేనాని... మాయావతిని మాతృమూర్తిగా అభివర్ణించారు...

బహుజన జనసేన విజయభేరి

By

Published : Apr 3, 2019, 9:06 PM IST

బహుజన జనసేన విజయభేరి
రాష్ట్ర విభజన, ప్రత్యేక హాదా విషయాల్లో కాంగ్రెస్, భాజపా మోసం చేశాయని ధ్వజమెత్తిన పవన్ కల్యాణ్... బీఎస్పీతోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మాయావతి ఉత్తరప్రదేశ్​లో చక్కని పాలన అందించారని పవన్ ప్రశంసించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీఎస్పీ, జనసేన, వామపక్షాల కూటమికి ఓటు వేయాలని కోరారు. కేంద్రంలో మాయావతిని ప్రధాని చేసేందుకు అన్నివిధాలా కృషి చేస్తామన్న పవన్... ప్రత్యేకహోదాకు మద్దతు తెలిపిన మాయావతికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details