బాగా పనిచేశాం.. గవర్నర్ మెచ్చుకున్నారు! - గోపాలకృష్ణ ద్వివేది
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది.. గవర్నర్ నరసింహన్ను హైదరాబాద్లో కలిశారు. శాసనసభ ఎన్నికల్లో గెలిచిన 175 మంది అభ్యర్థుల జాబితాతో గజిట్ నోటిఫికేషన్ అందించారు.
Dwivedi
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో బాగా పని చేశామన్నారు.. ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది. హైదరాబాద్లో గవర్నర్ నరహింహన్ను కలిసిన ఆయన.. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితాతో.. గజిట్ నోటిఫికేషన్ను ఇచ్చినట్టు చెప్పారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి.. మిగతా చర్యలు గవర్నర్ చూసుకుంటారన్నారు. ఎన్నికల నిర్వహణలో బాగా పని చేశారంటూ.. తమను గవర్నర్ అభినందించారని తెలిపారు.
Last Updated : May 26, 2019, 12:39 PM IST