ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

యర్రగొండపాలెం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా : మంత్రి సురేష్ - ఆదిమూలపు సురేష్

రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం...తన సొంత నియోజకవర్గం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు వచ్చిన ఆదిమూలపు సురేష్​కు వైకాపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని మంత్రి హామీఇచ్చారు.

యర్రగొండపాలెం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా : మంత్రి సురేష్

By

Published : Jun 16, 2019, 6:12 AM IST

యర్రగొండపాలెం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా : మంత్రి సురేష్
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి సొంత నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు వైకాపా నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. స్థానిక వైకాపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. బాణసంచాలు కాల్చి వేడుకలు జరుపుకున్నారు. యర్రగొండపాలెంలోని డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధాన కూడలిలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో మంత్రి మాట్లాడారు.

తనపై నమ్మకం ఉంచి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని మంత్రి సురేష్ అన్నారు. నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించి యర్రగొండపాలెం అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details