ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మాతృభాషను ఎన్నటికీ మర్చిపోవద్దు : ఉపరాష్ట్రపతి

ప్రతి ఒక్కరూ తమతమ మాతృభాషలను పరిరక్షించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మాతృభాష ద్వారానే మనసులోని భావాలను సులభంగా వ్యక్తీకరించవచ్చన్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

By

Published : Apr 24, 2019, 5:21 AM IST

మనసులోని భావనలను వ్యక్తీకరించేందుకు మాతృభాష ముఖ్య సాధనమని భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. చెన్నై టీనగర్ లోని కేసరి మహోన్నత పాఠశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలలో పాల్గొన్న ఆయన ప్రతిఒక్కరూ... మాతృభాషను పరిరక్షించుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఏదేశమేగినా ఎందు కాలిడినా మాతృభాషను మరవ రాదన్నారు. తమిళనాడులో తెలుగు చదవాలనుకునే విద్యార్ధులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. ఈ విషయమై తాను స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రి తో మాట్లాడనున్నట్లు స్పష్టం చేశారు. ఆ కార్యక్రమంలో వెంకయ్యతోపాటు గవర్నర్ బన్వరీ లాల్ పురోహిత్, కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ABOUT THE AUTHOR

...view details