రాష్ట్రంలో జరుగుతోన్న రాజకీయ ఘర్షణలపై దృష్టి పెట్టామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రెండు వర్గాల మధ్య వివాదం జరిగిన వెంటనే దృష్టి పెడితే వివాదం సద్దుమణుగుతుందన్నారు. పోలీసుల వారాంతపు సెలవుపై వేసిన కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి విధివిధానాలు రూపొందిస్తామని డీజీపీ అన్నారు. పోలీసులకు శారీరక విశ్రాంతితో పాటు మానసిక ప్రశాంతత చాలా అవసరమని స్పష్టం చేశారు. పోలీసు శాఖలో అధికారుల బదిలీలు సాధారణమన్న సవాంగ్...ఎన్నికల ముందు కోడ్ ప్రకారం బదిలీలు జరిగాయన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం బదిలీలు జరుగుతాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరించారు.
రాజకీయ ఘర్షణలపై దృష్టి పెట్టాం : డీజీపీ గౌతమ్ సవాంగ్ - వైకాపా
ఇరు వర్గాల మధ్య జరిగిన వివాదంపై పోలీసులు వెంటనే స్పందిస్తే...సమస్య సద్దుమణిగిపోతుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అభిప్రాయపడ్డారు. రాజకీయ ఘర్షణలపై దృష్టి పెట్టామన్న ఆయన...శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించమన్నారు. పోలీసుల సమస్యలపై కమిటీ నివేదికలు వచ్చాక తుది నిర్ణయాలుంటాయన్నారు.
రాజకీయ ఘర్షణలపై దృష్టి పెట్టాం : డీజీపీ గౌతమ్ సవాంగ్