కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వండి: ఈసీకి సీఎం లేఖ - babu
ఫొని తుపాన్ తీరంపైకి దూసుకొస్తున్నా ముందస్తు జాగ్రత్తలు చేపట్టేందుకు ప్రభుత్వానికి ఎన్నికల సంఘం అవకాశం ఇవ్వడం లేదని సీఎం మండిపడ్డారు. 4 జిల్లాల్లో ఎన్నికల నియమావళి మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తుపాను దృష్ట్యా నియమావళి మినహాయింపు కోరారు.
babu
ఉత్తరాంధ్ర,తూర్పుగోదావరి జిల్లాలపై తుపాను ప్రభావం ఉందని సీఎం తెలిపారు.ఆ జిల్లాల్లో హై అలెర్ట్ ఉందని...ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకునేందుకు కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు సీఎం.అప్పుడే ఆ ప్రాంతాల నేతలు స్పందించేందుకు వీలు కలుగుతుందని లేఖలో పేర్కొన్నారు.ఒడిశాకు మినహాయింపు ఇచ్చినట్లే ఏపీకి ఇవ్వాలని కోరారు.