అమెజాన్‌లోకి నూయీ - amazon director
పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా నూయీ అమెజాన్ బోర్డు డైరెక్టర్ల బృందంలో సభ్యులయ్యారు. సంస్థ ఆడిట్ విభాగంలో ఆమె విధులు నిర్వర్తించనున్నారు.
పెప్సీ కో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా నూయీ అమెజాన్ బోర్డు డైరెక్టర్ల బృందంలో సభ్యులయ్యారు. సంస్థకు చెందిన ఆడిట్ విభాగంలో ఆమె విధులు నిర్వర్తించనున్నారు.ఇప్పటి వరకు బోర్డులో 11 మంది ఉండగా.. నూయీ చేరికతో 12 కు పెరిగింది.మహిళా డైరెక్టర్ల సంఖ్య ఐదుకు చేరింది. కంపెనీ కొత్త విధివిధానాల్లో భాగంగా మార్పులు చేస్తోన్న అమెజాన్.. గత నెల బోర్డులోకి స్టార్‌బక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోసాలిండ్ బ్రూవర్‌ను తీసుకుంది. 2006 నుంచి 2018 వరకు పెప్సీకో సీఈవోగా పనిచేసిన ఇంద్రా నూయీ గత అక్టోబరులో పదవి నుంచి తప్పుకొన్నారు.