ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రాష్ట్రానికి జగనే పెద్ద సమస్య: చంద్రబాబు - Atmakur

తెదేపా పాలనలో చంపడమో.. చావడమో ఉండవని... అభివృద్ధి, సంక్షేమం మాత్రమే ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలు చేసే నేరగాళ్లను శాశ్వతంగా జైలుకే పరిమితం చేస్తామన్నారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు బహిరంగసభలో సీఎం చంద్రబాబు

By

Published : Apr 3, 2019, 5:12 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు బహిరంగసభలో సీఎం చంద్రబాబు
రాష్ట్ర విభజన తర్వాత అనేక ఇబ్బందులు, మరెన్నో అవమానాలు ఎదురైనా... రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని చంద్రబాబు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎన్నికల సభలో ప్రసంగించిన బాబు.. సుమారు వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతమే రాష్ట్రానికి పెద్ద ఆస్తిగా పేర్కొన్నారు. గోదావరి నీళ్లు నెల్లూరుకు వస్తాయన్న సీఎం..సాగర్‌ నుంచి సోమశిలకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాదన్నారు.


పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం వైకాపా, తెరాసకు ఇష్టం లేదన్న బాబు.. మోసాలు చేసే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి యువనేస్తంతో నిరుద్యోగులను ఆదుకుంటున్నానని తెలిపిన సీఎం.. కోడి కత్తి పార్టీ వల్ల ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తెదేపాతోనే సాధ్యమన్న చంద్రబాబు.. చంపడమో.. చావడమో వంటి వైకాపా నేతల వ్యాఖ్యలు చూస్తుంటే భయమేస్తోందన్నారు. గాంధీజీది అహింసావాదం,... మోదీది హింసావాదమని పేర్కొన్న చంద్రబాబు.. ఈ రాష్ట్రానికి జగన్ అనే పెద్ద సమస్య ఉందన్నారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు బుల్లెట్ ట్రైన్‌ తెచ్చే ప్రయత్నం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details