ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ప్రజల పూర్తి మద్దతు మాకు ఉంది: చంద్రబాబు - చంద్రబాబుతో

యువత మద్దతు తెదేపాకు ఉంది. ఇప్పుడు సీబీఎన్ ఆర్మీ పేరుతో స్వచ్ఛందంగా యువత సమాజ సేవ చేస్తున్నారు. 100 శాతం ప్రజలు మాతోనే ఉన్నారు.

ముఖ్యమంత్రితో ముఖాముఖి

By

Published : Apr 8, 2019, 7:30 PM IST

18 నుంచి 30 సంవత్సరాల వయస్సు చాలా ముఖ్యమైనది. ఎవరైతే ప్రభుత్వం ఇస్తున్న పథకాలను అవగాహన చేసుకున్నారో వారు తెదేపాతోనే ఉన్నారు. నిరుద్యోగ భృతి, కల్పించిన ఉద్యోగాలు వీటన్నింటినీ సానుకూల దృక్పథంతో తీసుకున్న వారు పార్టీతోనే ఉన్నారు. ఇప్పుడు సీబీఎన్ ఆర్మీ బాగా విస్తరించింది. వారు పార్టీ కార్యకర్తలు కారు. ఉద్యోగాలు చేసుకుంటున్న వారు.. వాటికి సెలవులు పెట్టి సీబీఎన్ ఆర్మీలో చేరి సొంత డబ్బులు ఖర్చు పెట్టి స్వచ్ఛందంగా సమాజ సేవ చేస్తున్నారు. 100 శాతం ప్రజల మద్దతు మాకు ఉంది. తెలంగాణ పెత్తనం మనమీద ఉంది అన్నప్పుడు ప్రజల ఆలోచన వేరేగా ఉంది. విభజన హామీలు ఏవీ నెరవేర్చలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు అన్నప్పుడు ప్రజలు మరింత వేగంగా స్పందిస్తున్నారు. ఆ స్పందన ఎలా ఉందనేది ఈ ఎన్నికల్లో తేలుతుంది.

ముఖ్యమంత్రితో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details