ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

భారత్ కు సిగ్​ సావర్​ - ఒప్పందం

భారత సైనిక దళాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు ప్రారంభించింది కేంద్రప్రభుత్వం. సుమారు రూ. 700 కోట్లు వెచ్చించి అమెరికా నుంచి సిగ్​ సావర్​ రైఫిళ్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది.

tupaki

By

Published : Feb 13, 2019, 6:27 AM IST

Updated : Feb 13, 2019, 12:51 PM IST

భారత సైనికుల పోరాట సామర్థ్యాలకు మరింత బలం చేకూర్చేందుకు ఆధునిక తుపాకులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అమెరికాకు చెందిన సిగ్​ సావర్​ సంస్థతో ఒప్పందం చేసుకుంది.

భారత అమ్ముల పొదిలో సిగ్​ సావర్​ రైఫిళ్లు...
72 వేల 400 అసాల్ట్​ రైఫిళ్లను సుమారు రూ. 700 కోట్ల రూపాయలు వెచ్చించి ఆయుధాల్ని సమకూర్చుకుంటోంది. ఇప్పటికే ఇలాంటి అత్యాధునిక రైఫిళ్లను అమెరికా దళాలతో పాటు, ఇతర ఐరోపా దేశాల్లో వినియోగిస్తున్నారు.

వీలైనంత త్వరగా భారత్​కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒప్పందంలో భాగంగా సంవత్సరంలోపే ఈ రైఫిళ్లు భారత్​కు చేరనున్నాయి. ప్రస్తుతం భారత సైన్యం ఇన్సాస్​ రైఫిళ్లను వినియోగిస్తోంది. 5.56X45 mm​ ఇన్సాస్​ రైఫిళ్ల స్థానంలో 7.62X51 mm అసాల్ట్​ రైఫిళ్లను తేనున్నారు.

ఈ బలమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన రైఫిళ్లతో భారత సైన్యానికి మరింత బలం చేకూరుతుందని భావిస్తోంది రక్షణశాఖ. ఈ ఒప్పందానికి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ఈ నెల ప్రారంభంలోనే ఆమోదం తెలిపారు.

Last Updated : Feb 13, 2019, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details