ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మోదీ... ఓ విఫల ప్రధానమంత్రి : చంద్రబాబు - babu-tweets

దేశంలో ఎన్నడూ లేనంతగా రాజ్యాంగ వ్యవస్థల మధ్య అంతర్‌ కలహాలు..మోదీ పాలనలో సాగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. 72 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇంత విఫల ప్రధానిని చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

babu

By

Published : May 9, 2019, 3:18 PM IST

దేశంలో మొదటిసారి నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బయటికొచ్చి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టు మీడియా చెప్పారని...రక్షణ శాఖ కార్యాలయంలోనే దేశ భద్రతకు సంబంధించిన పత్రాలు మాయం కావడం ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించారు. 70ఏళ్లలో దేశం చూసిన ప్రధానమంత్రుల్లో జవాబుదారీతనం లేని ప్రధాని మోదీ అని...పత్రికారంగం చెబుతోందని ట్విట్వర్‌లో పేర్కొన్నారు.ఒక్క మీడియా సమావేశం పెట్టని ప్రధానిగామోదీ నిలిచారని దుయ్యబట్టారు.

బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయటం సహా ఏటీఎంను దిష్టిబొమ్మలుగా చేశారని మండిపడ్డారు.నోట్లరద్దు పెద్ద కుంభకోణంగా మార్చారని...జీఎస్టీ సక్రమంగా అమలు చేయడంలో భాజపా ఘోరంగా విఫలమైందన్నారు.రూపాయి విలువ దారుణంగా పతనమైంగని... 72ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇంత విఫల ప్రధానిని చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

babu-tweets

ABOUT THE AUTHOR

...view details