మెదడుకు రక్తప్రసరణ తగ్గిపోయినందున ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే గురువారం ఆసుపత్రిలో చేరారు. గత రెండురోజుల నుంచి నరాల బలహీనత, నీరసం, ఇతర ఆరోగ్య సమస్యలతో హజారే బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.
ఆసుపత్రికి అన్నాహజారే! - అన్నా హజరే
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.
మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లా రాలేగావ్‌సిద్ధి గ్రామంలో నివాసముంటున్న హజారే ఉదయాన్నే అనారోగ్యంతో స్థానిక ఆసుపత్రిలో చేరారు. ఎంఆర్ఐ(మాగ్నెటిక్ రిసొనెన్స్ ఇమేజింగ్) స్కానింగ్ అనంతరం వైద్యుల సూచన మేరకు ప్రైవేటు ఆసుపత్రికి మారారు.
లోక్‌పాల్, లోకాయుక్త నియామకాల్లో జాప్యం, మహారాష్ట్ర రైతుల పట్ల ప్రభుత్వ తీరుకు నిరసనగా జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 వరకు అన్నా హజారే స్వగ్రామంలోనే నిరాహార దీక్ష చేశారు. లోక్‌పాల్ బిల్లు 2013లోనే పార్లమెంట్‌లో ఆమోదం పొందిందా ఇంతవరకూ లోక్‌పాల్, లోకాయుక్తలను నియమించపోవడాన్ని వ్యతిరేకిస్తూ వారం రోజుల దీక్ష చేశారు. ఈ సమయంలోనే హజారే దాదాపు 5 కిలోల మేర బరువు తగ్గారని వైద్యులు తెలిపారు.