ప్రేమలో పక్షులు. జంతువులు వాలంటైన్స్‌డే రోజున ఎన్నో జంటలు ఒక్కటవుతాయి. తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రేమికులు భిన్న పద్ధతులను అనుసరిస్తారు. సృష్టిలో మనుషులే కాదు... పక్షులు,జంతువులు అవధుల్లేకుండా ప్రేమించుకుంటాయి. కర్ణాటక రాయచూర్‌లోని సాలుద్దీన్ పార్కులోని మూగజీవులను చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది.
ప్రేమక్షణాలను ఆస్వాదిస్తూ ముచ్చటగొలిపాయి పార్కులోని పావురాలు, చిలుకలు. తమలోనూ ప్రేమ దాగుందని చాటిచెప్పాయి క్రూరమృగాలు. సింహాలు, పులులు వాటి సహచరులతో కలిసి జాలీగా విహరించాయి. వీటిని చూసిన వీక్షకులు మైమరిచిపోయారు.