అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణంలో వేరుశనగ విత్తనాల కోసం రైతులు ఆందోళన చేశారు. ఖరీఫ్ ప్రారంభమై పక్షం రోజులు అయినా ప్రభుత్వ రాయితీ విత్తనాలు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు విత్తనాల కోసం రాయదుర్గం పట్టణానికి వచ్చారు. విత్తన నిల్వలు లేవని అధికారుల చెప్పిన సమాధానంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వర్షాలు కురుస్తోన్న సమయంలో విత్తనాలు ఇవ్వకుండా ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారని రైతులు మండిపడ్డారు.
ఆందోళన బాటలో అన్నదాత.. విత్తనాలు అందని దుస్థితి
అనంతపురం రైతులు ఆందోళన బాటపట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా విత్తనాలు అందించడంలో అధికారులు విఫలమయ్యారని రైతులు నిరసన చేపట్టారు. రాయదుర్గం రోడ్డుపై బైఠాయించి విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు.
ఆందోళన బాటలో అన్నదాత..విత్తనాలు అందని దుస్థితి
ఇదీ చదవండి :అండగా ఉంటా... ప్రజల కోసం పోరాడుతా..