చెదరని చిరునవ్వు ఆమె సొంతం
ఆమె చిరుదరహాసం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అందమైన కళ్లు మన కళ్లను కనురెప్ప వేయనీయవు.. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాదీ సంజనతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
చిన్నతనం నుంచి ఫ్యాషన్ ప్రపంచం పట్ల ఎనలేని ఇష్టం కానీ..... కళాశాల రోజుల్లో పాల్గొన్న ఓ కార్యక్రమం ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది. మిస్ ఇండియా అవ్వాలన్న కలలకు రెక్కలు తొడిగింది. అయితే తన కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడుతూనే తల్లిదండ్రుల సంతోషం కోసం ప్రాజెక్ట్ మేనేజర్‌గా హైదరాబాద్‌లో పేరున్న సంస్థలో పనిచేస్తోంది. అందమైన కళ్లు... చెదరని చిరుదరహాసంతో తన తోటి వారినే కాదు ఫెమినా మిస్ ఇండియా జడ్జీలను సైతం ఆకట్టుకుంది.. హైదరాబాద్‌కి చెందిన సంజన. మనసు చెప్పింది చేస్తే చాలు విజయం వరిస్తుందంటున్న సంజన గురించి మరిన్ని విశేషాలు మీరే చూడండి...