ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'రైతులారా.. జాగ్రత్త వహించండి'!

ఖరీఫ్​ సీజన్​ ప్రారంభమవుతున్న సందర్భంగా రైతులు మోసపోకుండా ఉండాలని నెల్లూరు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ తెలిపారు. లైసెన్స్​ ఉన్న షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.

By

Published : Jun 20, 2019, 8:00 PM IST

'రైతులారా.... జాగ్రత్త వహించండి'!

రైతులు విత్తనాలు కొనుగోలు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులను మోసం చేసే పరిస్థితులు ఉంటాయని అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లైసెన్స్​ ఉన్న షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసినప్పుడు కచ్చితంగా బిల్లు తీసుకోవాలని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 16 విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయని, యూనిట్లను తనిఖీ చేసేందుకు నెల్లూరు జిల్లాలో వ్యవసాయ శాఖ 4 కమిటీలను వేసిందన్నారు. విత్తన వ్యాపారులు తప్పు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details