పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ జరిపిన దాడులపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. పుల్వామా ఘటన జరిగిన రెండు మూడు రోజుల్లోనే ఈ చర్య జరిగి ఉండాల్సిందన్నారు. విదేశాంగ కార్యదర్శి దీనిని యుద్ధం కోసం జరిపిన చర్యగా పేర్కొనకపోయినప్పటికీ... ఎప్పుడో జరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
'2,3 రోజుల్లోనే జరగాల్సింది'
కేంద్ర ప్రభుత్వం పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిపిన మెరుపు దాడులను ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు.
"పుల్వామా ఘటన జరిగిన రెండు మూడు రోజుల్లోనే ఈ చర్య జరిగి ఉండాల్సింది. ఈ చర్యను స్వాగతిస్తున్నా... ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వం వైపే ఉంటాం. ఐరాస చార్టర్లోని 51వ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతీ దేశానికి స్వీయ రక్షణ పొందే హక్కు ఉంది. ప్రస్తుత తరుణంలో ఏ దేశమైతేరాజ్య వ్యతిరేక చర్యలు అరికట్టలేదో...దాని వల్ల నష్టపోతున్న దేశంవాటిపై చర్య తీసుకోవచ్చు. ప్రస్తుతం భారత్ కూడా అదే చేసిందని నా అభిప్రాయం. విదేశాంగ కార్యదర్శి దీనిని యుద్ధం కోసం చేపట్టిన చర్యగా పేర్కొనకపోయినప్పటికీ... పుల్వామా ఘటన జరిగిన 2, 3 రోజుల్లోనే మెరుపు దాడులు జరగాల్సింది."
-అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం అధ్యక్షుడు