మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్యానంతరం కాన్పుర్‌లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లపై విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. అల్లర్లకు దారితీసిన పరిస్థితులపై అధ్యయనం చేసి ఆరు నెలల్లో సమర్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులలో ఆదేశించింది.
యూపీలో సిక్కుల ఊచకోతపై విచారణకు సిట్ - up
1984లో సిక్కుల ఊచకోతకు దారితీసిన పరిణామాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని యూపీ ప్రభుత్వం నియమించింది.
ఉత్తర ప్రదేశ్ మాజీ డీజీపీ అతుల్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీరిలో విశ్రాంత జిల్లా న్యాయమూర్తి సుభాష్ చంద్ర అగర్వాల్, విశ్రాంత అదనపు డైరెక్టర్ యోగేశ్వర్ కృష్ణ శ్రీవాస్తవ ఉన్నారు.
1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురైన అనంతరం కాన్పుర్‌లో జరిగిన అల్లర్లలో 125 మందికి పైగా మరణించారు. ఊచకోతపై సిట్ విచారణ చేపట్టాలని వేసిన వ్యాజ్యంపై స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం 2017 ఆగస్టులో ఆదేశించింది.