తూర్పు ఉత్తర ప్రదేశ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అక్కడకు వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యరు.
గతనెల 23న ప్రియాంకను తూర్పు ఉత్తర ప్రదేశ్ ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీ.
అక్బరు రోడ్డులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గదులు పక్క పక్కనే ఉండేలా ఏర్పాటు చేశారు.
రాహుల్ గాంధీ అధ్యక్షతన గురువారం జరిగే పార్టీ కార్యదర్శుల సమావేశానికి మొదటిసారి అధికారిక హోదాలో హాజరవుతారు ప్రియాంక.