ప్రియుడి మర్మాంగం కోసిన మహిళా డాక్టర్- రక్తం మడుగులో బాధితుడు! చివరకు!
Published : Jul 1, 2024, 6:56 PM IST
Lady Doctor Cut Lover Private Part : పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్న ఆరోపణతో ప్రియుడి మర్మాంగం కోసేసింది ఓ మహిళా డాక్టర్(25). ఈ ఘటన బిహార్లోని సారణ్ జిల్లా మధురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, హాజీపుర్కు చెందిన నిందితురాలు, స్థానిక వార్డు కౌన్సిలర్ మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని నిందితురాలు తరచూ ఒత్తిడి తెచ్చేది. బాధితుడు వాయిదా వేసేవాడు. ఈ క్రమంలో సోమవారం వీరిద్దరి మధ్య రిజిస్టర్ మ్యారేజ్ గురించి చర్చ జరిగింది. పెళ్లికి బాధితుడు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన డాక్టర్ అతడి మర్మాంగం కోసేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఒళ్లంతా రక్తంతో ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. మహిళా డాక్టర్ను అందుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.