LIVE : తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ప్రత్యక్ష ప్రసారం - TELANGANA FORMATION DAY 2024 - TELANGANA FORMATION DAY 2024
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 2, 2024, 9:38 AM IST
|Updated : Jun 2, 2024, 11:27 AM IST
Telangana Formation Day 2024 Live : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహిస్తోంది. ఉదయం నుంచే పరేడ్ గ్రౌండ్స్‌లో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళి అర్పించారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లారు. అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి ఓపెన్ టాప్ జీపులో పరేడ్ పర్యవేక్షించారు. ఆ తర్వాత జయ జయహే తెలంగాణ 2.30 నిమిషాల గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సాయంత్రం ట్యాంక్ బండ్‌పై ముగింపు వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. తెలంగాణ హస్తకళలు, ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో దశాబ్ది వేడుకలను చూడడానికి ట్యాంక్ బండ్‌కు వచ్చారు.
Last Updated : Jun 2, 2024, 11:27 AM IST