ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Live టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం- ప్రత్యక్ష సమావేశం - DEVINENI UMA LIVE - DEVINENI UMA LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 3:18 PM IST

Updated : May 17, 2024, 3:24 PM IST

TDP leader Devineni Uma fire on Sajjala Ramakrishna Reddy live : ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌ రామ‌కృష్ణారెడ్డిపై  దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేప‌ల్లిలోని నెస్ట్ స్పేస్ భ‌వ‌నంలో న‌కిలీ వార్త‌ల‌ను సృష్టిస్తూ సామాజిక మాధ్య‌మాలలో పోస్టు చేస్తున్నారు. దీనిలో ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్ ఉద్యోగులు 300 మంది ప‌ని చేస్తున్నారు. వార్త ఛానెళ్ల లోగోల‌ను మార్చి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు. ఓడిపోతామ‌న్న నిరాశ‌తోనే స‌జ్జ‌ల ఇలా దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. గ‌వ‌ర్న‌మెంట్ నుంచి జీతం తీసుకుంటున్న ఆయ‌న ఎవ‌రికి స‌ల‌హాలు ఇస్తున్నారు? త‌ప్పుడు వార్త‌ల‌పై త‌ప్ప‌కుండా ఎన్నిక‌ల క‌మిష‌న్‌కి ఫిర్యాదు చేస్తాం అని అన్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వానికి అధికారులు సహకరిస్తున్నారని , పింఛన్ పంపిణీలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీపై అసత్య ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల సంఘం పింఛన్ పంపిణీపై సత్వర నిర్ణయం తీసుకొని వైసీపీ అసత్య ప్రచారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లతో కాకుండా ప్రభుత్వాధికారులే పింఛన్ పంపిణీ చేయాలని పేర్కొన్నారు. త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పెంపుదల చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మీడీయాతో మాట్లాడుతూన్నారు. ప్రత్యక్ష సమావేశం మీకోసం.
Last Updated : May 17, 2024, 3:24 PM IST

ABOUT THE AUTHOR

...view details