కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన - త్వరలో రెండు గ్రామాల దత్తత - Nara Bhuvaneshwari Visit Kuppam - NARA BHUVANESHWARI VISIT KUPPAM
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 23, 2024, 4:29 PM IST
Nara Bhuvaneshwari Visit Kuppam Constituency : సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మొదటి రోజు గుడుపల్లెలో పర్యటించారు. గిస్కెపల్లి, పెద్దూరు, చిన్నూరు, సోమాపురం, వెంకటాపురం గ్రామాల వద్ద మహిళలు, కార్యకర్తలు నారా భువనేశ్వరికి ఘనస్వాగతం పలికారు. గజమాలలు వేసి పూల వర్షాన్ని కురిపించారు. ఎన్నికల సమయంలో కుప్పం ప్రాంతంలో ఉత్తమ మెజార్టీ సాధించిన గ్రామాన్ని దత్తత తీసుకుంటామని ఇచ్చిన హామీ మేరకు రెండు గ్రామాలను ఆమె దత్తత తీసుకోనున్నారు. గుడుపల్లె మండలంలోని కంచిబందార్లపల్లె, కుప్పం మండలం పైపాళ్యం గ్రామాలను దత్తత తీసుకొని మౌలిక వసతులు కల్పించనున్నారు. భువనేశ్వరి పర్యటనతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నారా భువనేశ్వరి విస్తృతంగా ప్రచారం చేసి ఎన్నికల సమయంలో కీలక భూమిక పోషించారు. ప్రజలకు మరింత దగ్గరయ్యారు. భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో మరో నాలుగు రోజులు పర్యటించి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోనున్నారు.