ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నాలుగో దశలో ఎన్నికలు ప్రతిపక్షాలకు అనుకూలం - పెరగనున్న పార్టీ అభ్యర్థుల ఖర్చు - General Elections 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 17, 2024, 12:16 PM IST

General Elections in Four Phases Benefit of Opposition Parties: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు మొదటి దశలో కాకుండా నాలుగో దశలో నిర్వహించడం ప్రతిపక్ష పార్టీలకు అనుకూలించనుంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం వెలువడిన షెడ్యూల్ తేదీకి, పోలింగ్‌కు మధ్య చాలా సమయం ఉంది. దీంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఎన్నికలకు అన్ని విధాలా సమాయత్తమయ్యేందుకు వెసులుబాటు లభించనుంది. ఈసారి 58 రోజుల వ్యవధి ఉండటంతో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సమన్వయానికి తగిన సమయం దొరికినట్లుగా ఉంది. 

నేతలంతా కలిసి పని చేసేలా ఓట్ల బదిలీ సక్రమంగా జరిగేలా చూసేందుకు వెసులుబాటు కానుంది. అసంతృప్తులను అధినేతలు బుజ్జగించేందుకు అవకాశం దక్కింది. మరోవైపు పోలింగ్‌కు సుమారు 2 నెలల సమయం ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులకూ ఖర్చు పెరగనుంది. అధికార పార్టీ అభ్యర్థులకు మరింత ఎక్కువ ఖర్చు కానుంది. వైసీపీ నేతలు, అభ్యర్థులు ఇప్పటికే అనేక చోట్ల వాలంటీర్లకు, వివిధ వర్గాల వారికి కానుకలు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఈ ప్రక్రియను మరింత ముమ్మరం చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details