ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చంద్రబాబుతో డీజీపీ భేటీ - త్వరలో పోలీసు యంత్రాంగం ప్రక్షాళన ఉంటుందని స్పష్టం - DGP met CM Chandrababu - DGP MET CM CHANDRABABU

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 9:57 PM IST

DGP Dwarakathirumala Rao met CM Chandrababu at Secretariat: డీజీపీ ద్వారకా తిరుమల రావు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెం హత్య ఘటనపై ప్రాధమిక సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు డీజీపీ వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సీఎం డీజీపీని ఆదేశించారు. త్వరలోనే పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన ఉంటుందన్న సీఎం చంద్రబాబు ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు. ఈపూరుపాలెం ఘటనలో దోషులకు వెంటనే కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

రూ.10 లక్షల ఆర్థికసాయం: బాపట్ల జిల్లాలో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధితురాలి కుటుంబసభ్యులను ఓదార్చి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. ఈ క్రమంలో హూంమంత్రి అనిత మాట్లాడూతూ రాష్ట్రంలో గంజాయి మాఫియా ఆగడాలు ఎక్కువైపోయాయని వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం చెక్కు అందజేసిన ఎమ్మెల్యే కొండయ్య అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details