LIVE: దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Devineni Uma Maheswara Live - DEVINENI UMA MAHESWARA LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 30, 2024, 3:04 PM IST
|Updated : Mar 30, 2024, 3:27 PM IST
Devineni Uma Maheswara Press Meet Live: సీఎం జగన్ శుక్రవారం ఎమ్మిగనూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. సీఎం జగన్ తనది పేదల పార్టీ అని, మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, అందులో పెత్తందారులంతా ఒకవైపు, పేదలంతా ఒకవైపు ఉండి పోరాడాలంటూ సీఎం పిలుపునిచ్చారు. సీఎం వ్యాఖ్యలను దేవినేని తిప్పికొట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్విహంచారు. నిన్నట్లు సభలో సీఎం జగన్ అసత్య ప్రచారాలు చేశారని పేర్కొన్నారు. నాడు-నేడు, విద్యా దీవెన, అమ్మఒడి పథకాల గురించే చెప్పినా, ప్రజల నుంచి స్పందన లేదని ఎద్దేవా చేశారు. సీఎం మాట్లాడిన ఐదు నిమిషాలకే ప్రజలు వెనుదిరిగారని విమర్శించారు. నిన్న జరిగిన సీఎం సభ కోసం ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ, డోన్, కోడుమూరు, కర్నూలు, పాణ్యం, ఇతర ప్రాంతాల నుంచి సుమారు 1,300 బస్సుల్లో ప్రజలను తరలించారు. ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ చేనేత మైదానంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు. దీనికి ఇరువైపులా బారికేడ్లు కట్టి, బ్యానర్లు వేశారు. మధ్యలో ర్యాంప్ వేసి పెద్దఎత్తున జనం పోగైనట్లు చూపించారు.
Last Updated : Mar 30, 2024, 3:27 PM IST