ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వివేకాను హత్య చేయించిన జగన్​కు ఓటు అడిగే హక్కు ఉందా?: దస్తగిరి - pulivendula elections

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 3:36 PM IST

Dastagiri Comments on Jagan about Contest in Elections : కడప జైలులో దేవిరెడ్డి చైతన్య రెడ్డి తనను ప్రలోభాలకు గురి చేయడం వాస్తవం అయితే ఆ విషయాన్ని దాచేందుకు జైలు అధికారులు యత్నిస్తున్నారని వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి తెలిపారు. జైల్లో తన బ్యారెక్ ఎదుట అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజ్​ను బయటికి తీస్తే అన్ని విషయాలు బహిర్గతం అవుతాయన్నారు. కడప జైలులోని ప్రలోభాలపై సీబీఐ, ఎస్పీకి లేఖలు రాశానని దస్తగిరి కడపలో మీడియా సమావేశంలో వెల్లడించారు. వివేకాను హత్య చేసిన తనకు ఓటు అడిగే హక్కు లేదంటున్నారు. అయితే వివేకాను హత్య చేయించిన జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో ఓటు అడిగే హక్కు ఉందా అని దస్తగిరి ప్రశ్నించారు. 

జైల్లో తనను అధికారులు తీవ్రంగా వేధించి లెటర్ కూడా రాయించుకున్నారని దస్తగిరి పేర్కొన్నారు. రిమాండ్ ఖైదీగా కాకుండా పనిష్​మెంట్ ఖైదీగా చూశారని అతను ఆవేదన వ్యక్తం చేశారు. తన చేత తప్పు చేయించి ఇపుడు తనపైనే బురద జల్లుతున్నారని దస్తగిరి వ్యాఖ్యానించారు. పులివెందులకు చెందిన వైసీపీ కౌన్సిలర్ తన భార్యను బెదిరించి, డబ్బులు ఆఫర్ చేశారని దస్తగిరి తెలిపారు. ప్రస్తుతం తాను జై భీమ్ భారత్ తరపున పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.  

ABOUT THE AUTHOR

...view details