ఎలుగుబంట్ల వరుస దాడులు - భయాందోళనలో ప్రజలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 3:59 PM IST
Bears Attacked Four People Srikakulam District : వరుస ఎలుగుబంట్ల దాడులతో సిక్కోలువాసులు భయాందోళనకు లోనవుతున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో నలుగురు వ్యక్తులపై ఎలుగుబంట్లు దాడి చేశాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు ఎలుగుబంట్ల దాడి నుంచి అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తున్న కుమారస్వామి పై మొదట దాడి చేశాయి. వాటి దాడి నుంచి తప్పించుకునేందుకు కుమార స్వామి చెట్టు ఎక్కినా వదల్లేదు.
Victims are Being Treated at the Hospital : డెప్పూరు వద్ద తోటకు వెళ్తున్న నారాయణమ్మ (65) అనే మహిళపై దాడి చేశాయి. కుమార స్వామికి, నారాయణమ్మకు ఎలుగుబంట్ల దాడిల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఇద్దరిపై ఎలుగుబంట్లు దాడికి యత్నించాయి. వాళ్లు వాటి నుంచి తప్పించుకున్నారు. ఎలుగుబంట్ల దాడితో గాయపడిన వారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎలుగుబంట్ల దాడి నుంచి తమని రక్షించాలని బాధిత కుటుంబసభ్యులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.