Vijayawada People Suffer With Drainage Problem :విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1.01 లక్షల ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఉండగా కనెక్షన్లు లేని ఇళ్లు 1.09 లక్షల ఇళ్లు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ సౌకర్యం లేక చిన్నపాటి వర్షానికే కాలనీలు నీటమునుగుతున్నాయి. డ్రైనేజీలు పద్ధతి ప్రకారం శుభ్రం చేయకపోవడంతో చుట్టుపక్కల నివాసం ఉండే ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీల్లో మురుగునీరు, చెత్తా చెదారం ఎక్కువ రోజులు నిల్వ ఉండడంతో దోమలు, ఈగలు పెద్ద సంఖ్యలో చేరుతున్నాయి.
రోడ్లపైనే చెత్త : వీఎంసీ అధికారులు, పాలక పక్షం దేశంలోనే విజయవాడ నగరం పారిశుధ్యంలో వెలిగిపోతోందని గొప్పలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. మురుగు కాలువల్లో నుంచి తీసిన చెత్తను సైతం రోజుల తరబడి రోడ్లపైనే విడిచిపెడుతున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
ఫ్లాట్లు ఇచ్చారు, పాట్లు మిగిల్చారు - ఆటోనగర్ అంటేనే భయపడుతున్న వాహనదారులు
నగర అభివృద్ధికి నిధులు విడుదల చేయన సీఎం జగన్ : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చాలా చోట్ల చేపట్టిన మురుగు కాలువల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతోనే ఈ పనులు ఆగిపోయాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పనులు అర్థాతరంగా ఆగిపోవడంతో చుట్టుపక్కల నివాసం ఉండే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగర అభివృద్ధికి గతంలోసీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) విడుదల చేస్తానన్న నిధులు నేటికీ పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. ఆ నిధులు రాబట్టడంలో స్థానిక నేతలు విఫలమయ్యారు.