ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవం - మువ్వన్నెల జెండా ఎగురవేసి మంత్రులు - Ministers hoisted National Flag - MINISTERS HOISTED NATIONAL FLAG

Ministers hoisted National Flag in Various Districts : రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు మువ్వన్నెల జెండా ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Ministers hoisted National Flag in Various Districts
Ministers hoisted National Flag in Various Districts (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 10:23 PM IST

Ministers hoisted National Flag in Various Districts : రాష్ట్రవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర మంత్రులు వివిధ జిల్లాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరిచారు. ఈ సందర్భంగా వారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మహానీయుల త్యాగ ఫలాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని మంత్రులు ఆకాక్షించారు.

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు :అనకాపల్లిలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో హోంమంత్రి అనిత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతపురం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో మంత్రి పయ్యావుల కేశవ్‌ జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు. నెల్లూరులో మంత్రి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఏలూరు పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన వేడుకల్లో మంత్రి పార్థసారథి మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తాం - రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తాం: లోకేశ్ - Lokesh Speech

ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు :కడపలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి ఫరూక్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తిరుపతిలో జరిగిన వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. భీమవరం కలెక్టరేట్‌ ఆవరణలో మంత్రి నిమ్మల రామానాయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాజమహేంద్రవరంలో మంత్రి కందుల దుర్గేష్‌ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. రాయచోటి పోలీస్‌ పరేడ్‌ మైదానంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేయగా బాపట్ల జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో మంత్రి గొట్టిపాటి రవి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వేడుకల్లో పాల్గొన్న మంత్రులు :శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్‌ పరేడ్‌ క్రీడా మైదానంలో మంత్రి సవిత త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఒంగోలులో మంత్రి డీబీవీ స్వామి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించగా, కర్నూలు పోలీస్‌ పరేడ్‌ మైదానంలో మంత్రి టీజీ భరత్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అమలాపురం బాలయోగి స్డేడియంలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌ జాతీయ జెండా ఎగురవేశారు. విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడ కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల జాతీయ జెండా ఎగురవేశారు.

78వ స్వాతంత్య్ర వేడుకలు : శాసనసభ ప్రాంగణంలో సభాపతి అయ్యన్నపాత్రుడు జాతీయ జెండా ఎగురవేశారు. శాసన మండలి వద్ద ఛైర్మన్‌ మోషేన్‌ రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ స్కూల్‌లో నిర్వహించిన వేడుకల్లో ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విశాఖలో తూర్పు నౌకాదళం, పోర్టు ట్రస్ట్ భద్రతా విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ పాల్గొన్నారు. విశాఖ పోర్ట్ స్టేడియంలో పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ అంగముత్తు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కొట్టేశారు - కర్ణాటకలో అమ్ముకున్నారు: పవన్‌ - Pawan Kalyan at Independence Day

'ఆడవాళ్లపై అకృత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష- వెన్నులో వణుకు పుట్టేలా ప్రచారం చేయండి!'- వారికి మోదీ స్ట్రాంగ్ వార్నింగ్! -

ABOUT THE AUTHOR

...view details