ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోతి చేష్టలకు వృద్ధ దంపతులు బలి - అసలేం జరిగిందంటే? - A Couple Died Due To Monkey - A COUPLE DIED DUE TO MONKEY

A Couple Died Due To Monkey : ఆ దంపతులకు ఆరు పదులు దాటాయి. వృద్ధాప్యంలో ఒకరికి ఒకరై జీవనం సాగిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ అకస్మాత్తుగా వారు నురగలు కక్కుతూ పడిపోయారు. అంతే అదే వారికి ఆఖరి రోజైంది. ఆ భార్యాభర్తల చావుకు కారణం ఒక కోతి. నమ్మడానికి కాస్తా విచిత్రంగా అనిపించినా అసలు కారణం అదే. మరి అదెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

A Couple Died Due To Monkey
A Couple Died Due To Monkey (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2024, 9:42 AM IST

Updated : Sep 15, 2024, 11:45 AM IST

Old Couple Died Poisonous Tea in Rajanagaram : కోతులు జనావాసాల్లోకి ప్రవేశించి ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నాయి. కొన్ని సార్లు వానరాల చేష్టలతో మనుషుల ప్రాణాలే పోతున్నాయి. తాజాగా ఓ కోతి చేసిన పని వృద్ధ దంపతులు మరణానికి కారణమైంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజానగరం మండలంలోని పల్లకడియంలో వెలుచూరి గోవిందు (70), వెలుచూరి అప్పాయమ్మ (64) దంపతులు నివసిస్తున్నారు.

వీరి ఇంటి ఆవరణలో శుక్రవారం నాడు ఓ కోతి ఒక గుళికల ప్యాకెట్‌ను తీసుకువచ్చి వదిలేసి వెళ్లింది. అప్పాయమ్మకు కంటి చూపు తక్కువగా ఉండడంతో గుళికల ప్యాకెట్‌ను (వాసనలేని) టీపొడి ప్యాకెట్‌గా భావించి టీ కాచింది. భర్త గోవిందుకు కొంత ఇచ్చి తాను తాగింది. కాసేపటికి వారు నోటినుంచి నురగలు కక్కుతూ పడిపోయారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు గమనించి వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Old Couple Died Pesticides Tea : చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి దాటాక దంపతులు మృతి చెందారు. వీరికి ముగ్గురు సంతానం కాగా కుమారుడు రాజమహేంద్రవరంలోని అపార్టుమెంట్లలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు అయ్యాయి. ఒక కుమార్తె కోటిపల్లి వెంకటలక్ష్మి భర్త చనిపోవడంతో పల్లకడియంలోనే వేరుగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు. వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. జంతువులు కానీ పక్షులు ఏమైనా వస్తువులను తీసుకొచ్చి ఇంటిలో వదిలినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇది వరకూ ఇలాగే చేయడంతో నమ్మి :గతంలోనూ ఓ కోతి ఇలాగే ఓ ప్యాకెట్‌ వీరి ఇంటి ఆవరణలో జార విడిచి వెళ్లిందని వెంకటలక్ష్మి తెలిపారు. దానిని అప్పట్లో తమ తల్లి తీసి దాచి టీ పెట్టుకున్నారని చెప్పారు. ఇప్పడు కూడా అదే భావనతో గుళికల ప్యాకెట్‌నూ టీ పొడి ప్యాకెట్‌గా భావించి మృత్యువాతపడ్డారని వెంకటలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలో దంపతుల మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఓనం వేడుకల్లో విషాదం! గొంతులో ఇడ్లీ ఇరుక్కుని వ్యక్తి మృతి

నెల్లూరు నగరంలో రౌడీషీటర్‌ దారుణ హత్య - పాతకక్షలే కారణమా? - Rowdy Sheeter Brutal Murder

Last Updated : Sep 15, 2024, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details