ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిన్న ఫుల్​ - నేడు నిల్​ - కుప్పానికి హంద్రీనీవా జలాల 'సినిమా సెట్టింగ్​' - హంద్రీనీవా కాలువ

No Water in Handri Neeva Canal: కెమెరా, రోల్, యాక్షన్. సీఎం జగన్ హంద్రీనీవా జలాలను కుప్పానికి విడుదల కార్యక్రమంలో జరిగిన తీరు. వైఎస్సార్సీపీ నేతలు రక్తి కట్టించిన 'సినిమా సెట్టింగ్'​ను అధికారులు రెండో రోజే పీకి పడేశారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని తెలుసుకున్న గ్రామస్థులు, టీడీపీ కార్యకర్తలు కాలువలోకి దిగి నిరసన చేశారు.

No_Water_in_Handriniva_Canal
No_Water_in_Handriniva_Canal

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 8:08 PM IST

'సినిమా సెట్టింగ్​'ను తలపించిన కుప్పానికి నీరు విడుదల కార్యక్రమం - జగన్​కు కుప్పంపై ఉత్తుత్తి ప్రేమేనా!

No Water in Handri Neeva Canal :సోమవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి తన అధికార బలంతో చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. కుప్పానికి హంద్రీ నీవా జలాలను విడుదల చేసిన జగన్‌, ప్రత్యేక జల పూజలు చేశారు. 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నీటిని తరలించామని జగన్ వెల్లడించారు. ప్రస్తుతం చూస్తే కాలువలో నీళ్లు ఆగిపోయాయి. ఎందుకిలా ఆగిపోయా అని గ్రామస్థులు ఆశా తీస్తే ఇది కేవలం ఎన్నికల స్టంట్​కు ఉపయోగించిన 'సినిమా సెట్టింగ్'​ అని తెలిసి ముక్కున వేలువేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే,

కుప్పం నియోజకవర్గాన్ని ఉద్ధరించింది తానేనంటూ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన గొప్పలు ఉత్తిదేనని తేలిపోయింది. సోమవారం ఆర్భాటంగా కృష్ణా జలాలను విడుదల చేసిన జగన్‌ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గానికి నీళ్లు తీసుకొచ్చామంటూ ఊదరగొట్టేశారు. వారం రోజులుగా ఎగువ ప్రాంతంలో కాలువకు అడ్డుకట్ట వేసి మరీ నిల్వ చేసిన జలాలను సీఎం విడుదల చేసి ఫొటోలకు తెగ ఫోజులిచ్చారు. రామకుప్పం మండలం రాజుపేట వద్ద నిన్న సీఎం నీళ్లు విడుదల చేసిన చోట ఇవాళ పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి గొప్పల కోసం ఏర్పాటు చేసిన గేట్లను కూడా పొక్లెయిన్‌ సహాయంతో తొలగించారు. సీఎం వచ్చి వెళ్లిన ఒక్కరోజుకే నీటి విడుదల కూడా ఆపేసిన ప్రభుత్వం 110 చెరువులను ఎలా నింపుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.

కుప్పంలో హంద్రీ-నీవా జలాలను విడుదల చేసిన సీఎం జగన్‌

ఎన్నికల స్టంట్​గా హంద్రీనీవా జలాల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన మరుసటి రోజున మంగళవారం హంద్రీనీవా కాలువ బోసిపోయిన దృశ్యాలను స్థానిక తెలుగుదేశం నాయకులు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేసేందుకే జగన్ కుప్పానికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలపై ఆయనకు ఎలాంటి అభిమానం లేదన్న విషయం హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా తేలిపోయిందని అన్నారు. ఎన్నికల అనంతరం చంద్రబాబు పాలనలోహంద్రీనీవా జలాలతో కుప్పాన్ని సస్యశ్యామలం చేయడం తద్యమని తెలిపారు. కానీ జగన్‌ మాటలు, చేసిన హడావుడి కేవలం ఎన్నికల స్టంట్‌గా మిగిలిపోయింది.

పదేళ్లుగా అదే తీరు - రైతు పాలిట శాపంగా హంద్రీనీవా

ఈ మాత్రం దానికి నానా హంగామా చేసి, భారీగా ఏర్పాట్లు చేశారంటూ టీడీపీ నాయకులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా జలాల విడుదల కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించారని ప్రశ్నిస్తూ, నీళ్లు లేని కాలువలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు.

ఆఖరి నెలలో అద్భుతాలు :కుప్పం సభలో చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక భావజాలానికి నిదర్శనమని టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. నాలుగేళ్ల 10నెలల్లో కుప్పం నియోజకవర్గ ప్రజలకు తాగునీరు ఇవ్వని జగన్ ఆఖరి నెలలో అద్భుతాలు చేస్తాననడం ప్రజల్ని వంచించడమేనని మండిపడ్డారు.

సాగు నీరు కోసం రైతుల ఆందోళన - పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకోలు

ABOUT THE AUTHOR

...view details