ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తమాషాగా ఉందా? మా ప్రచార రథం ఆపితే బాగుండదు'- మహిళా అధికారికి మంత్రి అప్పలరాజు బెదిరింపులు - appalaraju fires on officials

Minister Appalaraju Fires on Election Officials: ఎన్నికల అధికారులతో మంత్రి అప్పలరాజు వాగ్వాదం పెట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందని వైసీపీ ప్రచార రథం ఆపిన అధికారినిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంకోసారి వైసీపీ ప్రచార రథం ఆపితే బాగోదని, ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister_Appalaraju_Fires_on_Election_Officials
Minister_Appalaraju_Fires_on_Election_Officials

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 1:38 PM IST

Minister Appalaraju Fires on Election Officials: శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఎన్నికల అధికారులతో మంత్రి అప్పలరాజు వాగ్వాదానికి దిగారు. పలాసలో శుక్రవారం సాయంత్రం నిబంధనలకు విరుద్ధంగా ఉందని వైసీపీ ప్రచార రథాన్ని ఎన్నికల అధికారి ఆశాలత ఆపారు. ఈ చర్యపై అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార రథం, లక్ష రూపాయలు ఆవిడకు ఇచ్చేయండంటూ తన అనుచరులకు మంత్రి ఆదేశించారు.

'తమాషాగా ఉందా? మా ప్రచార రథం ఆపితే బాగుండదు'- మహిళా అధికారికి మంత్రి అప్పలరాజు బెదిరింపులు

మీ ఇష్టం వచ్చినట్లు తయారుచేసి వాహనం ఇవ్వాలని, అప్పుడు వాడుకుంటాం అని మహిళా అధికారిపై తీవ్ర స్వరంతో అన్నారు. తమాషాలు చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు చెబుతుంటే గొడవ పెట్టుకుంటారు ఏంటి అని అధికారిని ఆశాలత ప్రశ్నించారు. 175 నియోజకవర్గాల్లో నిబంధనలు లేవు, పలాసలోనే నిబంధనలా అని మంత్రి ఆవేశంతో ఊగిపోయారు. ఇంకోరి ప్రచార రథం ఆగితే బాగోదని, ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండని మంత్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం. మీరొక్కరే విధులు నిర్వర్తిస్తున్నారా అని అధికారిని బెదిరించారు.

వైఎస్సార్సీపీ అభ్యర్థికి అసమ్మతి సెగ - జెండాలను కాళ్లతో తొక్కి, కాల్చివేసిన పార్టీ నేతలు - YSRCP Leader Dissenting

ABOUT THE AUTHOR

...view details