ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు వారాల్లో సాగునీటి సంఘాల ఎన్నికలు- హర్షం వ్యక్తం చేస్తున్న నిపుణులు - Elections to irrigation societies

Irrigation Societies Elections Soon: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో సాగునీటి సంఘాల ఎన్నికలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు సంఘాలకు ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఎన్నికల నిర్వహణపై సాగునీటి రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Irrigation Societies Elections Soon
Irrigation Societies Elections Soon (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 7:24 AM IST

Updated : Aug 30, 2024, 10:08 AM IST

Government Conduct For Irrigation Societies Elections Soon:సాగునీటి సంఘాల ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఎత్తిపోతల పథకాల పరిధిలోని రైతులనూ సాగునీటి సంఘాల్లో సభ్యులుగా తీసుకురావాలని నిర్ణయించింది. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనేక ప్రాజెక్టుల్లో గేట్లు, కట్టలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల పంట కాల్వలు, మురుగు కాల్వల్లో పూడికలు పేరుకుపోవడంతో పాటు ఆక్రమణల వల్ల నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల ఆక్రమణలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు సంఘాలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కార్యాచరణను సిద్ధం చేసింది.

రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు 3 వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గత ఐదు సంవత్సరాలలో రివర్స్‌ పాలన సాగించిన జగన్‌ సర్కార్‌ 2020లో సాగునీటి సంఘాల వ్యవస్థను రద్దు చేసింది. ఫలితంగా సంఘాలు నిర్వీర్యమై ప్రాజెక్టుల శివారు రైతులకు సాగునీరందక అన్నదాతలు అనేక ఇబ్బందులు పడ్డారు. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోవడం, పంట కాల్వలు, మురుగు కాల్వల్లో పూడిక పెరిగి చిన్నపాటి వర్షాలకే ముంపునకు గురికావడంతో రైతులు ఆపారంగా నష్టపోయారు. సాగునీటి సంఘాల ఆవశ్యకతను గుర్తించిన కూటమి ప్రభుత్వం రైతుల భాగస్వామ్యాన్ని పునరుద్ధరించే విధంగా ఎన్నికల నిర్వహణకు ఆమోదముద్ర వేసింది.

రివర్స్ టెండరింగ్‌ విధానం రద్దు - పాత మద్యం పాలసీకి క్యాబినెట్ ఓకే : పార్థసారథి - AP Cabinet Decisions

ప్రస్తుతం 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు, 6,149 సాగునీటి వినియోగదారుల కమిటీల పరిధిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిర్ణయం ముదావహమని సాగునీటి రంగాల నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సాగునీటి సంఘాల ద్వారా నీటి తీరువాను వసూలు చేసి కాల్వలకు మరమ్మతులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నిధులతో పాటు ప్రభుత్వం అదనంగా మరిన్ని నిధులను కేటాయించినప్పుడే సాగునీటి సంఘాలకు ఆర్థిక జవసత్వాలు వస్తాయని చెబుతున్నారు. 10 లక్షల రూపాయల లోపు నామినేషన్ ప్రాతిపదికన పనులు కేటాయించే అవకాశమున్నందున సంఘాల ఛైర్మన్లు కాంట్రాక్టర్లుగా రూపాంతరం చెందకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సాగునీటి సంఘాల ఎన్నికలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. పార్టీల పరంగా ఎన్నికలు నిర్వహించడం వల్ల అసలైన రైతుల భాగస్వామ్యం దెబ్బ తింటుందన్నారు. కీలకమైన ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తున్న తరుణంలో విధాన పరమైన నిర్ణయాల్లో రైతు సంఘాల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రైతుల జాబితాల రూపకల్పన అభ్యంతరాల స్వీకరణలో ప్రభుత్వం జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

నూతన మద్యం విధానం రూపకల్పనకు కేబినెట్‌ సబ్‌కమిటీ నియామకం - Sub Committee on New Liquor Policy

Last Updated : Aug 30, 2024, 10:08 AM IST

ABOUT THE AUTHOR

...view details