CID Investigation on ICICI Bank Fraud :పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంక్ శాఖల్లో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్న బాధితులను మోసం చేసిన వ్యవహారంలో చిలకలూరిపేట బ్యాంకు సిబ్బందిని సీఐడీ అడినషల్ ఎస్పీ ఆదినారాయణ, సీఐడీ సీఐ సంజీవ్ కుమార్ ఆధ్వర్వంలో ఉదయం 11 గంటల నుంచి అధికారులు విచారించారు.
కఠిన చర్యలు తీసుకుంటాం :చిలకలూరిపేట, నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంక్ శాఖల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతున్నట్లు సీఐడీ అడిషనల్ ఎస్పీ ఆదినారాయణ తెలిపారు. ఈ రెండు శాఖలతో పాటు విజయవాడ బ్రాంచ్‌లో మేనేజర్‌గా పని చేసిన నరేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి 72 మంది ఖాతాదారుల డబ్బు దారి మళ్లించినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. మూడు శాఖల్లో కలిపి 28 కోట్ల రూపాయలు మాయమైనట్లు ఐసీఐసీఐ విజయవాడ జోనల్ మేనేజర్ దినేష్ మెహ్ర సీఐడీకి ఫిర్యాదు చేయడంతో చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్‌లో సిబ్బందిని, ఖాతాదారుల్ని విచారిస్తున్నట్లుపేర్కొన్నారు. నష్టపోయిన బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామన్న అడిషనల్ ఎస్పీ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు
నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచిన బ్యాంకు మేనేజర్ - కోట్లలో స్వాహా