ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి నిర్మాణం స్పీడప్​ - ప్రతి సెంటు భూమి తీసుకోవాలని నిర్ణయం - Capital Amaravati Construction - CAPITAL AMARAVATI CONSTRUCTION

Capital Amaravati Construction Land Acquisition in AP : రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. రాజధాని నిర్మాణంలో ప్రధాన సమస్యగా ఉన్న భూసేకరణకు ప్రభుత్వం మాస్టర్​ ప్లాన్​ను రూపొందించింది. ఇందులో భాగంగా భూమి సమీకరణ లేదా సేకరణ విధానంలో తీసుకోవాలని సీఆర్​డీఏ వర్గాలు సృష్టం చేశారు.

amaravathi_land
amaravathi_land (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 5, 2024, 7:46 AM IST

Capital Amaravati Construction Land Acquisition in AP :రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగంగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా రాజధాని పరిధిలోని ప్రతి సెంటు భూమి సమీకరణ లేదా సేకరణ విధానంలో తీసుకోవాలని నిర్ణయించింది. గ్రామాలు, గ్రామకంఠాల కిందనున్న భూమి తప్ప మిగిలిన భూమి అంతా తీసుకోనుంది. దీనిలో ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఉండదని సీఆర్‌డీఏ (CRDA) వర్గాలు స్పష్టంచేశాయి. భవనాలనూ సీఆర్‌డీఏ స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

భూములపై కోర్టు స్టేలు ఉంటే వాటిని వెకేట్‌ (Vacate) చేయించి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకూ ఎవరైనా భూములు ఇవ్వకుంటే వారికి భూ సమీకరణ విధానంలో మరో అవకాశం ఇస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. నిర్దేశిత గడువు విధించి, అప్పటికీ ముందుకు రాకపోతే భూసేకరణ చట్టాన్ని అనుసరించి తీసుకోవాలని నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో ఇంకా తీసుకోవాల్సిన భూమి 4,181 ఎకరాలుంటే అందులో ఎక్కువ భాగం తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోనే ఉంది.

రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలి - రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు ప్రభుత్వం నిర్దేశం - CRDA Authority Meeting

మాస్టర్‌ప్లాన్‌ అమలుకు ఆ భూములు తప్పనిసరి : రాజధాని పరిధిలో ఉన్న గ్రామాలను కదిలించకూడదనే కృతనిశ్చయంతోనే సీఆర్​డీఏ అధికారులు మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేశారు. విస్తరించిన గ్రామ కంఠాల్ని(Village Land) కూడా భూసమీకరణ నుంచి మినహాయించారు. 217 చ.కి.మీ.ల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల్ని పరిగణనలోకి తీసుకుని రాజధానిని 9 థీమ్‌ సిటీల కాన్సెప్ట్‌తో (9 Theme Cities Concept) నిర్మించేందుకు బృహత్‌ ప్రణాళిక వేశారు. రాజధాని సమీపంలోని మొత్తం భూమిని తీసుకుంటేనే మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం నిర్మాణం సాధ్యం అవుతుంది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు వచ్చి ఆగిపోవడానికి ప్రధాన కారణం భూసేకరణ సమస్యే! ఇలాంటి అవరోధాలు లేకుండా రాజధాని నిర్మాణం సజావుగా పూర్తి కావాలంటే మొత్తం భూమిని తీసుకోవాల్సి ఉంది.

అమరావతిలో మరో రెండు రాచబాటలు - సీఆర్​డీఏ తాజా ప్రతిపాదన - Amaravathi National Highways

కుట్రపూరితంగా వ్యవహరించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం :భూ సమీకరణలో స్థలాలు ఇచ్చేందుకు ముందుకు రాని రైతుల నుంచి భూసేకరణ పద్ధతి(Land Acquisition System) ద్వారా తీసుకునేందుకు 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. సుమారు 2,101 ఎకరాల భూసేకరణకు అప్పట్లో ముసాయిదా నోటిఫికేషన్లు(Draft notifications) జారీ చేసింది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా భూసేకరణ నోటిఫికేషన్‌లను ఉపసంహరించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుట్రపూరితంలో భాగంగా సుమారు 1197.30 ఎకరాలకు అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఈ నోఫికేషన్‌లను వెనక్కు తీసుకున్నారు. మాస్టర్‌ప్లాన్‌ను విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కుట్ర పన్నింది.

సమీకరణలో ఇస్తే ప్యాకేజీ, సేకరణకు వెళితే పరిహారం! :సమీకరణ విధానంలో భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఏటా కౌలు చెల్లించడంతో పాటు, మెట్ట భూములు అయితే ఒక్కో ఎకరానికి 1,000 చదరపు గజాల నివాస, 250 చ.గ. వాణిజ్య స్థలాల్ని కేటాయిస్తుంది. అదే జరీబు భూములైతే 1,000 చ.గ. నివాస, 450 చ.గ. వాణిజ్య స్థలాలు ఇస్తారు. సమీకరణ విధానానికి ముందుకు రాని రైతులకు 2013 భూసేకరణ చట్టాన్ని (Land Acquisition Act) అనుసరించి సహాయ, పునరావాస ప్యాకేజీని అందజేస్తారు. రాజధానిలోని భూముల విలువల్ని ప్రభుత్వ రికార్డుల్లో పెంచలేదు కాబట్టి సేకరణకు వెళితే తక్కువ పరిహారం వస్తుందని రైతులు ‘సమీకరణ’ విధానానికే మొగ్గు చూపే అవకాశము ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

అమరావతిలో ఐదేళ్లుగా నీళ్లలోనే భవనాల పునాదులు - పటిష్ఠత నిర్థారణకు ఐఐటీ బృందాల పర్యటన - Review on Amaravati Situation

ABOUT THE AUTHOR

...view details