Burden on Electricity Consumers: అధిక ధరకు విద్యుత్ కొనుగోళ్లతో పాపం చేసిందంతా అధికారులు. ఆ నిర్ణయాలతో ఎలాంటి సంబంధం లేకున్నా ధరల భారం మొత్తాన్ని ప్రజలే భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు వెయ్యి కోట్ల భారం వేసిన తర్వాత గానీ అధికారులకు తాము చేసిన తప్పు తెలిసిరాలేదు. అధిక ధరకు కుదుర్చుకున్న స్వల్పకాలిక ఒప్పందాలను ఎట్టకేలకు రద్దుచేశారు. దీంతో ప్రజలకు స్వల్ప ఊరట లభించింది. విద్యుత్ పంపిణీ సంస్థలు అధిక ధరకు కుదుర్చుకున్న 800 మెగావాట్ల విద్యుత్‌ను వెనక్కి ఇచ్చేశాయి. దీంతో ప్రజలపై పడబోయే సుమారు 200 కోట్ల భారం తప్పింది.
వేసవిలో విద్యుత్ డిమాండ్ సుమారు 270 మిలియన్ యూనిట్లకు చేరుతుందని డిస్కంలు అంచనా వేశాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్ పోను ఇంకా అవసరమైన మేరకు వివిధ ఉత్పత్తి సంస్థలతో డిస్కంలు ఎస్టీఓఏను కుదుర్చుకున్నాయి. అంచనాల మేరకు డిమాండ్ పెరగకపోవడం వలన అలా కొనే విద్యుత్ మిగిలిపోతోంది. దీంతో తక్కువ ధరకు అందే థర్మల్ విద్యుత్‌ను పక్కనపెట్టి అధిక ధరకు ఎస్టీఓఏల ద్వారా వచ్చే విద్యుత్‌ను డిస్కంలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా చేస్తున్న డిస్కంల నిర్వాకంపై ‘ఈనాడు’లో వచ్చిన కథనాలతో అధికారులు పునరాలోచనలో పడ్డారు.
విద్యుత్ బిల్లు చూస్తే దడ - కట్టలేక వణికిపోతున్న జనం - Electricity Bill Hike in YCP Govt
గత ఏడాది అక్టోబరులో ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు 3 వేల 640 ఎంయూలను విద్యుత్ ఉత్పత్తి సంస్థలు అందించాలి. ఈ ప్రకారం డిమాండ్‌కు అనుగుణంగా రోజుకు సుమారు 35 ఎంయూల విద్యుత్ ఎస్టీఓఏల ద్వారా అందనుంది. ఆ విద్యుత్‌కు యూనిట్‌కు సగటున 8 రూపాయల 69 పైసల చొప్పున డిస్కంలు చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్స్ఛేంజీల్లో యూనిట్ ధర గరిష్ఠంగా నాలుగున్నర రూపాయలు ఉంటోంది.