ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు - హాల్​టికెట్ ఇలా ఫోన్​లోనే డౌన్​లోడ్ చేసుకోండి - AP INTER EXAMS HALL TICKET DOWNLOAD

వాట్సప్​లోనే ఇంటర్​ పరీక్షల హాల్‌టికెట్లు - 9552300009 నంబర్​కి హాయ్​ అని పెట్టడంతో ద్వారా డౌన్​లోడ్ చేసుకోవచ్చు

AP INTER EXAMS
AP INTER EXAMS (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2025, 5:16 PM IST

AP INTER EXAMS HALL TICKET DOWNLOAD: ఆంధ్రప్రదేశ్​లో ఇంటర్మీడియట్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. మార్చి 1, 3వ తేదీల నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్‌ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సప్‌ గవర్నెన్స్‌లో అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఇంటర్మీడియట్ బోర్డు అఫీషియల్ వెబ్‌సైట్‌ నుంచి సైతం డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇటీవల ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధంచిన హాల్‌ టికెట్లను వాట్సప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొనే సదుపాయం కల్పించారు. ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు కాలేజీలు హాల్‌టికెట్లు ఆపేయడం వంటి ఘటనలు జరగకుండా వాట్సప్​లోనే హాల్​టికెట్లు డౌన్​లోడ్ చేసుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా పలు సేవలను ప్రభుత్వం అందిస్తోంది. వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా ఎంతో సింపుల్​గా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పదో తరగతి విద్యార్థులు సైతం వాట్సప్​లోనే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించాలని విద్యాశాఖ భావిస్తోంది.

హాల్‌టికెట్​ ఎలా డౌన్​లోడ్ చేసుకోవాలి అంటే:

  • ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నెంబర్​కి మీ ఫోన్‌లో హాయ్ (Hi) అనే వాట్సప్​లో మెసేజ్ చేయండి.
  • సేవను ఎంచుకోండి అంటూ ఒక లింక్ వస్తుంది.
  • ఆ లింక్​పై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి.
  • అందులో విద్య సేవలు అనే ఆప్షన్​ను సెలక్ట్ చేసుకోండి.
  • అనంతరం ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ లేదా సెకండ్‌ ఇయర్‌ హాల్‌ టికెట్​ డౌన్​లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది.
  • మీరు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంట్ అయితే పదో తరగతి హాల్‌టికెట్‌ నెంబర్ లేదా ఆధార్‌ నంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  • మీరు ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ స్టూడెంట్ అయితే ఫస్ట్‌ ఇయర్‌ హాల్‌టికెట్‌ నంబర్‌ లేదా ఆధార్‌ నంబర్‌, పుట్టిన తేదీ ఎంటర్‌ చేయాలి.
  • కొద్ది నిమిషాల్లోనే మీ హాల్‌టికెట్‌ వాట్సప్​కే వచ్చేస్తుంది.
  • దానిని డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్‌ తీసుకోవడమే. అంతే ఇలా ఎంతో సింపుల్​గా మీ ఫోన్​లోనే హాల్ టికెట్​ని డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

Intermediate Exams Schedule: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుంచి జరుగుతాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20 వరకు నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.

వాట్సప్‌లోనే ఏపీ ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్లు - ఇలా డౌన్​లోడ్ చేసుకోండి

టెన్షన్​ వద్దు - పక్కా ప్రణాళికతో చదివితే పరీక్షలు పాస్‌

ABOUT THE AUTHOR

...view details