Jagapathi Babu Bhimavaram Rajula Food: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) పెట్టే ఫుడ్ గురించి కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవల్లో ప్రతి ఒక్కరూ కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. ఇప్పటికే చాలామంది నటీనటులు ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి చెప్పారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో జగపతి బాబు కూడా చేరిపోయారు. తాజాగా ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఓ వీడియో షేర్ చేశారు. అందులో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. వాటిని బకాసురుడిలా తిని, కుంభకర్ణుడిలా పడుకున్నానంటూ జగ్గూ భాయ్ (Jagapathi Babu) తెలిపారు.
ప్రభాస్ పెట్టే ఫుడ్‌తో ఈ బాబు బలి: దీనికి 'వివాహ భోజనంబు వింతైన వంటకంబు, వియ్యాలవారి విందు ఓ హో హో నాకే ముందు' అంటూ ఆ భోజనానికి సెట్ అయ్యేలా ఓ పాటను సైతం యాడ్ చేశారు. అంతే కాకుండా మరికొన్ని కామెంట్స్ కూడా ప్రభాస్ గురించి రాసుకొచ్చారు. ఇది ప్రభాస్ ప్రమేయం లేకుండా జరిగిందని, దీని గురించి ఎవ్వరూ చెప్పొద్దని అన్నారు. ఎందుకంటే ఎవరైనా సరే చెప్తే తను పెట్టే ఫుడ్‌తో ఈ బాబు బలి అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. అదీ బాహుబలి లెవల్ అంటూ కొనియాడారు. ఆ ఫుడ్‌ని పందికొక్కులాగా తిని, ఆంబోతులాగా పడుకుంటున్నానంటూ ప్రభాస్ గురించి జగ్గూబాయ్ చెప్పుకొచ్చారు.
జై భీమవరం రాజులు:అంతే కాకుండా భీమవరం రాజులను సైతం జగపతి బాబు గుర్తు చేసుకున్నారు. భీమవరం రాజులు పెట్టిన ఫుడ్ తిన్నాక వారిని కొనియాడకుండా ఉంటారా చెప్పండి. జై భీమవరం, జై రాజులు, జై బాహుబలి, జై ప్రభాస్ అంటూ భీమవరం రాజులను ఆకాశానికి ఎత్తేశారు. ఇంతకీ జగ్గూ భాయ్ భీమవరం ఎందుకు వెళ్లారంటే, ఓ షూటింగ్ కోసం అని చెప్పారు. ప్రభాస్‌తో కలిసి జగపతి బాబు చేసిన సలార్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. సలార్ చిత్రంలో జగపతి బాబు రాజమన్నార్ పాత్రలో నటించారు.