ETV Bharat / state

2023లో అధికారంలోకి రావడం ఖాయం: మందకృష్ణ

author img

By

Published : Aug 15, 2020, 7:33 AM IST

మహాజన సోషలిస్టు పార్టీతో 2023లో తాము అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి కుటుంబాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వరంగల్ అర్బన్ జిల్లా వడ్డేపల్లిలో ఆయన రాత్రి నిద్ర చేశారు.

mandakrishna madiga fires on government
2023లో అధికారంలోకి రావడం ఖాయం: మందకృష్ణ

రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి కుటుంబాల పట్ల తెరాస ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఇందుకు నిరసనగా వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం వడ్డేపల్లిలోని శివాలయంలో శుక్రవారం రాత్రి ఆయన నిద్ర చేశారు.

అమరుల త్యాగాలే తెలంగాణ రాష్ట్రానికి మార్గాన్ని సుగమం చేశాయని మందకృష్ణ పేర్కొన్నారు. వారి త్యాగాలను సమాధి చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. మహాజన సోషలిస్టు పార్టీతో 2023లో తాము అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరుల కాంస్య విగ్రహాలను వారి వారి గ్రామ, మండల కేంద్రాల్లో ప్రతిష్టిస్తామని, అమరుల త్యాగ దినాన్ని నిర్వహించడంతో పాటు వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో..

వరంగల్ నగర అభివృద్ధిని ప్రభుత్వం విస్మరించిందని ఆయన దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రాన్ని ఒప్పించి కాజీపేట్​లో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమవుతామని స్పష్టం చేశారు.

2023లో అధికారంలోకి రావడం ఖాయం: మందకృష్ణ

ఇవీచూడండి: హైదరాబాద్‌కు హెరిటేజ్ గుర్తింపు వచ్చేలా కృషిచేస్తా: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.