ETV Bharat / state

లాక్​డౌన్​ సడలింపుతో రోడ్డుపై రైరై..

author img

By

Published : May 7, 2020, 12:11 PM IST

గ్రీన్‌జోన్‌లో ఇచ్చిన సడలింపులతో సిద్దిపేట జిల్లాలో రహదారులపైకి జనం రాక పెరిగింది. పల్లెలు, పట్టణాల్లోనూ ఈ ధోరణి కనిపించింది. వ్యక్తిగత వాహనాల సందడి అధికమైంది. 20 శాతం ఆటోలు రోడ్డెక్కడం గమనార్హం.

Siddipet district latest news
Siddipet district latest news

సిద్దిపేట జిల్లాలో లాక్​డౌన్​ సడలింపుతో సింహభాగం మండల కేంద్రాల్లో నిషేధిత జాబితాలో ఉన్నవి మినహాయించి అన్ని రకాల దుకాణాలు తెరుచుకున్నాయి. పురపాలికల్లో మాత్రం అన్ని రకాల దుకాణాలు తెర్చుకోలేదు. గ్రామాల నుంచి మండలాలు, పట్టణ కేంద్రాలకు నామమాత్రంగా ఆటోలు నడిచాయి. రవాణా, రిజిస్ట్రేషన్‌ శాఖల్లో కార్యకలాపాలు షురూ అయ్యాయి. దాదాపు 45 రోజుల నిర్బంధం తర్వాత సడలింపు ఇవ్వడంతో ప్రజలు కాస్త స్వేచ్ఛగా రహదారులపైకి రావడం గమనార్హం. సిద్దిపేటలో కొన్ని మిఠాయి దుకాణాలు తెరిచారు. ఇవి నిషేధిత జాబితాలో ఉన్నాయి. దీంతో బల్దియా అధికారులు వాటిని మూసివేయించారు.

గజ్వేల్‌ పురపాలికలో భవన నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలు ప్రారంభం కాలేదు. చేర్యాల, హుస్నాబాద్‌ పురపాలికల్లోనూ ఇదే స్థితి నెలకొంది. దుబ్బాకలో దాదాపు అన్ని రకాల దుకాణాల్లో కార్యకలాపాలు షురూ అయ్యాయి. పురపాలికల్లో 50 శాతం దుకాణాలు తెరవాలనే నిబంధన విధించారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఈ మేర నిర్ణయం ప్రకటించడం వల్ల బుధవారం బల్దియా అధికారులు ఈప్రక్రియను అమలు చేయలేకపోయారు. వైద్య, భవన నిర్మాణ, వ్యవసాయ అనుబంధ రంగాలు, నిత్యావసర సరకుల విభాగంలోని దుకాణాలను నిత్యం తెరిచే అవకాశం ఉంది. నిషేధిత జాబితాలో లేని వస్త్ర, ఫుట్‌వేర్‌, బుక్‌డిపో తదితరాలకు ప్రత్యేకంగా నంబర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తేదీల వారీగా బేసి, సరి సంఖ్యల ఇచ్చి దుకాణాలు తెరిచేలా చూడాలని ఉత్తర్వులు జారీ చేసింది. దుబ్బాకలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

గ్రామాల నుంచి పట్టణాలకు...

జిల్లాలో 11,327 ఆటోలుండగా.. దాదాపు 20శాతం ఆటోలు రోడ్డెక్కాయి. గ్రామాల నుంచి మండల, పట్టణ కేంద్రాలకు నడిచాయి. ఎక్కువ మంది సొంత ద్విచక్రవాహనాలపై రాకపోకలు సాగించారు. పట్టణాల్లో మాత్రం ద్విచక్ర వాహనాలు, కార్ల రాకపోకలు పెరిగాయి. లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే బుధవారం జన సంచారం అధికమైంది. కొంత మంది మాస్క్‌లు ధరించకపోగా, మరికొంత మంది భౌతిక దూరం పాటించకపోవడం ఆందోళన కల్గిస్తోంది.

రిజిస్ట్రేషన్లకు శ్రీకారం...

జిల్లాలో రిజిస్ట్రేషన్‌, రవాణా శాఖల్లో కార్యకలాపాలు మొదలయ్యాయి. సిద్దిపేట అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో 19, గజ్వేల్‌లో 11, సిద్దిపేట గ్రామీణ కార్యాలయంలో నాలుగు, దుబ్బాకలో ఒక రిజిస్ట్రేషన్‌ అయింది. హుస్నాబాద్‌, చేర్యాలలో బోణి కాలేదు. జిల్లాలో మొత్తం 35 రిజిస్ట్రేషన్లు కాగా సుమారు రూ.4.70 లక్షల ఆదాయం వచ్చింది.

జిల్లా రవాణశాఖ అధికారి కార్యాలయం కూడా తెరుచుకుంది. తొలి రోజు పరిమిత సేవలు అందాయి. మీ-సేవా కేంద్రాల్లో స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ మధ్యాహ్నం మొదలైంది. గురువారం నుంచి రవాణశాఖ కార్యాలయంలో డ్రైవింగ్‌ లర్నింగ్‌ లైసెన్స్‌ల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్‌ ధ్రువపత్రాల జారీ సహా అన్ని రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయని జిల్లా రవాణశాఖ అధికారి రామేశ్వర్‌రెడ్డి తెలిపారు. గతంలో మాదిరి చేర్యాల, గజ్వేల్‌, హుస్నాబాద్‌ యూనిట్‌ కార్యాలయాల్లో వారంలో రెండు రోజుల పాటు సేవలు అందిస్తామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.