ETV Bharat / state

అంత్యక్రియలకు తప్పిన అగచాట్లు!

author img

By

Published : Jul 2, 2020, 10:48 AM IST

కరోనా బలిగొన్న వారి అంత్యక్రియలకు ఇబ్బందులు తొలగాయి. మృతదేహాన్ని అంబులెన్సులో ఎక్కించుకుని గంటల తరబడి నగరవ్యాప్తంగా శ్మశానాల చుట్టూ చక్కర్లు కొట్టే దుస్థితికి తెరపడింది. జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాలాపూర్‌ సమీపంలో 40 ఎకరాల భూమిని వీరి కోసం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అన్ని మతాల వారికి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మున్ముందు విద్యుత్తు దహనవాటికను అందుబాటులోకి తీసుకురానున్నారు.

cemetry for covid deaths in hyderabad
అంత్యక్రియలకు తప్పిన అగచాట్లు!

రాష్ట్ర వ్యాప్తంగా 267 మంది కరోనా కోరల్లో చిక్కి మృతి చెందారు. వీరిలో 80 శాతానికి పైగా గ్రేటర్‌ పరిధిలోని వారే. నిబంధనల ప్రకారం వీరికి ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించాలి. కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు కడసారి చూపునకు మాత్రమే అనుమతి ఉంటుంది. అది కూడా.. దూరంగా ఉండి చూడాలి.

భౌతికకాయాన్ని ఆసుపత్రి నుంచి శ్మశానానికి తరలించడం, అంతిమ సంస్కారం సర్కారు పని. నగరంలో జీహెచ్‌ఎంసీ ఆ బాధ్యత నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో బల్దియా సిబ్బంది ఇటీవలి వరకు విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నారు. మృతదేహాలను తీసుకొని శ్మశానవాటికల కోసం చక్కర్లు కొట్టారు. స్థానికులు అంత్యక్రియలకు అనుమతించకపోవడమే అందుకు కారణం.

ఈ నేపథ్యంలో సర్కారు నగర పరిధిలోని జిల్లా కలెక్టర్లకు, కొవిడ్‌ ప్రత్యేక శ్మశానవాటిక కోసం విశాలమైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని ఆదేశించింది. బాలాపూర్‌ సమీపంలోని ఉస్మాన్‌నగర్‌ శ్మశానవాటికను గుర్తించారు. నేతలు, జల్‌పల్లి మున్సిపాలిటీ సహకారంతో 40 ఎకరాలను సమీకరించారు. కొన్ని రోజులుగా కరోనా మృతులకు అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. మున్ముందు విద్యుత్తు దహనవాటికను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి: ఖజానా కళకళ: కరోనా వేళా పెరిగిన రాష్ట్ర రాబడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.