ETV Bharat / state

Damaged roads: వానొస్తే... మా రోడ్డు మాయమైపోతుంది..!

author img

By

Published : Jul 4, 2021, 7:57 AM IST

నల్గొండ పట్టణంలోని రహదారుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. గుంతలు, గతుకుల రోడ్లపై అడుగు తీసి అడుగు వేయాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు. వర్షం పడితే... రోడ్డెక్కడుందో వెతుక్కోవాల్సి వస్తోందని నగరవాసులు వాపోతున్నారు. ఎన్నికలప్పుడు ఓట్లకోసం వచ్చే నాయకులు ఓసారి రోడ్డు చూసి వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

nalgonda-people-facing-problems-with-road-damages
వానొస్తే... మా రోడ్డు మాయమైపోతుంది..!

నల్గొండ జిల్లా కేంద్రానికి వివిధ పనుల కోసం నిత్యం వందల సంఖ్యలో జనం వస్తుంటారు. పానగల్, మర్రిగూడ బైపాస్, దేవరకొండ, మిర్యాలగూడ తదితర రహదారులు నిత్యం రద్దీగా ఉంటాయి. ప్రస్తుతం ఇవన్నీ గుంతలు, గతుకుల మయంగా మారాయి. పానగల్‌ బైపాస్ నుంచి గడియారం సెంటర్ వరకు.. దేవరకొండ రోడ్‌ నుంచి క్లాక్‌టవర్ సెంటర్ రహదారులు పూర్తిగా పాడైపోయాయి. నిత్యం పట్టణంలో తిరిగాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

nalgonda-people-facing-problems-with-road-damages
రోడ్డు పాడైపోయి తేలిన కంకర...

హైదరాబాద్ వెళ్లే రోడ్డులో డ్రైనేజీ నీరంతా నిండిపోయింది. అటుగా వెళ్తున్న ఆటో గుంతలు కనపడక పల్టీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. డ్రైవర్​కి కూడా చాలా దెబ్బలు తగిలాయి. అందరూ ఆటో సరిగ్గా నడపకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తిడ్తున్నరు. మాకూ బాధ్యత తెలుసు.కావాలని మేమేం ప్రమాదాలు చేసుకోం కదా. రోడ్లుస్సలే బాగాలేవు. - శ్రీనివాస్, ఆటో డ్రైవర్

ఒళ్లంతా హూనం చేసుకున్నా.. ఆటో రిపేర్లకే

పట్టణంలో కొన్నిచోట్ల మురుగునీటి పారుదల పనుల్లో భాగంగా... మరమ్మతుల కోసమని గుంతలు తీసి వదిలేశారు. వర్షాలకు వాటిలో నీళ్లు నిలిచి రోడ్డు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. గుంతల రోడ్లపై ఆటో నడుపుతూ ఒళ్లు హూనం చేసుకొని సంపాదించిన డబ్బులన్నీ... ఆటో రిపేర్ల​కే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దృష్టిసారించి గతుకుల రోడ్ల నుంచి విముక్తి కల్పించాలని స్థానికులు వేడుకుంటున్నారు.

గుంతలు తీసి వదిలేశారు...

రోడ్డు పాడై మధ్యలోనే సూచిక బోర్డుల ఏర్పాటు

ప్రధాన రహదారులే కాదు. సీసీ రోడ్లు కూడా గుంతలు, గతుకులతో నిండిపోయాయి. వర్షమొస్తే అసలేం కనిపిస్తలే. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికైనా అధికారులు స్పందిచాలి. - నర్సింహ, ప్రయాణికుడు

అభివృద్ధి పనుల పేరుతో ఉన్నరోడ్లు తవ్వేసి నరకం చూపిస్తున్నారని వాహనదారులు ఆగ్రహిస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లీ పరిస్థితి అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అఇకారులు స్పందించి రోడ్లను బాగు చేయించాలని పట్టణవాసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: SPIDER: ఈ స్పైడర్​కి ఇంద్రధనస్సు రంగులు ఎందుకంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.