బడుగు బలహీన వర్గాల తరఫున పోరాడే.. ఎల్.రమణనే ఎమ్మెల్సీగా గెలిపించాలని తెతెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ప్రశ్నించే గొంతుకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి.. మండలికి పంపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు రావుల. ఈ సమావేశంలో తెతెదేపా రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ నాయుడు, జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు బి.రాములు, పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: త్వరలోనే 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: కేటీఆర్