ETV Bharat / state

నాగర్ కర్నూల్‌లో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు

author img

By

Published : Mar 14, 2021, 11:53 AM IST

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ఎల్ శర్మన్ సందర్శించి... పోలింగ్ సరళిని పరిశీలించారు. బూత్‌ అధికారులకు పలు సూచనలు సలహాలు ఇస్తూ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.

Peaceful MLC elections in Nagar Kurnool
నాగర్ కర్నూల్‌లో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని బాలబాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ పరిశీలించారు. క్యూలైన్‌లో నిల్చున్న ఓటర్లతో ముచ్చటించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

పోలింగ్ కేంద్రాల్లోని అధికారులకు పలు సూచనలు సలహాలు ఇస్తూ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని మొత్తం 44 పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఇదీ చదవండి: మహబూబాబాద్​లో తెరాస-వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.