ETV Bharat / state

'టైగర్​ జోన్ పేరిట తమకు అన్యాయం జరుగుతోంది'

author img

By

Published : Feb 4, 2021, 7:25 PM IST

టైగర్ రిజర్వ్​ జోన్ పేరుతో అటవీశాఖ తమకు అన్యాయం చేస్తోందంటూ నాగర్ కర్నూలు జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

Farmers in Nagar Kurnool have complained that forest department is doing injustice
'టైగర్​ జోన్ పేరిట తమకు అన్యాయం జరుగుతోంది'

తమ భూముల్లో వ్యవసాయం చేసుకోకుండా అడ్డుకున్న అటవీశాఖ అధికారుల చర్యలను నిరసిస్తూ.. నాగర్ కర్నూలు కలెక్టరేట్​ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.

అమ్రాబాద్​లోని పలు రైతులకు చెందిన భూములను.. అటవీశాఖ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలో స్వాధీనపరచుకుంది. పనులు ప్రారంభించే వరకు భూములు సాగు చేసుకోవచ్చునని గతంలో వారికి హామీ ఇచ్చింది.

'టైగర్ రిజర్వ్ జోన్' పేరుతో.. ఇప్పుడు భూముల్లోనికి రానివ్వకుండా అధికారులు తమను అడ్డుకుంటున్నారని రైతులు వాపోయారు. ఇళ్లకు నోటీసులు పంపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాగు భూములే తమ జీవనాధారమంటున్నారు.

తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ.. రైతులు కలెక్టర్​కు విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేయవద్దని మొరపెట్టుకున్నారు.

ఈ నిరసనలో అమ్రాబాద్ మండలంలోని సార్లపల్లి, వటవర్లపల్లి, కుడిచింతల బైల్ గ్రామాలకు చెందిన రైతులు, స్థానిక భాజపా నేతలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అర్ధనగ్నంగా చిన్నారి మృతదేహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.