ETV Bharat / state

కంటైన్మెంట్ క్లస్టర్ జోన్​లో కలెక్టర్ పర్యటన

author img

By

Published : Apr 12, 2020, 11:00 AM IST

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గాజుల రామారం, చంద్రగిరి నగర్​ను కంటైన్మెంట్ క్లస్టర్ జోన్​గా గుర్తించింది. ఫలితంగా ఈ ప్రాంతాన్ని జిల్లా యంత్రాంగం తన ఆధీనంలోకి తీసుకుంది. క్లస్టర్ జోన్​లో బారికేడ్ల ఏర్పాట్లపై అధికారులతో కలిసి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పర్యటించారు.

కంటైన్మెంట్ ప్రదేశాల్లో బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పరచాలి : కలెక్టర్

మేడ్చల్ జిల్లాలోని కంటైన్మెంట్ క్లస్టర్ జోన్​లో కలెక్టర్ పర్యటించారు. బారికేడ్ల ఏర్పాట్లపై అధికారులకు సూచనలు అందించారు. స్థానికులకు నిత్యావసర సరకులు అందుతున్న తీరుపై ఆరా తీశారు. చంద్రగిరినగర్​లో పని చేస్తున్న ఆశ వర్కర్లు కరోనా వైరస్​పై ఇళ్లకు వెళ్లినప్పుడు ఎదురయ్యే సమస్యలపై ఆరా తీశారు. కంటైన్మెంట్ ప్రదేశాల్లో బారికేడ్లను, సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రోత్సహించాలని పోలీసులకు సూచించారు.

ఉర్ధూ, తెలుగులో మైక్ ద్వారా...

అనంతరం సమీక్షలో భాగంగా బాలనగర్ డీసీపీ కార్యాలయానికి కలెక్టర్ వెళ్లారు. ప్రతిరోజు సాయంత్రం పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, వైద్యాధికారులు సమావేశమై కరోనా వైరస్ నియంత్రణపై చర్చించుకోవాలని ఆదేశించారు. పాజిటివ్ కేసులు వచ్చిన కంటైన్మెంట్ ప్రాంతాల్లోని కుటుంబాలకు, వైరస్ గురించి మైక్ ద్వారా ఉర్దూ, తెలుగులో ప్రచారం చేయాలన్నారు. ఈ మేరకు ప్రజలకు వ్యాధి నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యాసాగర్, డీసీపీ పద్మజా రెడ్డి, ఆర్డీఓ మల్లయ్య, తహసీల్దార్ గౌరీవత్సల పాల్గొన్నారు.

ఇవీ చూడండి : కరోనా విజృంభణ: 503కు చేరిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.