అవయవదానంపై అవగాహన కల్పిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జనహిత సేవా సమితి 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జెండా ఊపి ప్రారంభించారు. తిలక్ మైదానం నుంచి ఏఎంసీ వరకు పరుగు చేపట్టారు. ఎమ్మెల్యే కూడా హుషారుగా పాల్గొన్నారు. జనహిత సేవ సమితి చేస్తున్న కార్యక్రమం ఆదర్శంగా ఉందన్నారు. అవయవ దానంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:ఎన్నికల ఆర్భాటాలు... ఉద్యోగ పోరాటాలు