ETV Bharat / state

కరీంనగర్​లో చెత్త తగ్గింపునకు కసరత్తు

author img

By

Published : Jun 6, 2020, 6:26 PM IST

నగరాలు, పట్టణాల్లో చెత్త నిల్వ చేసేందుకు స్థలం కరవవుతోంది.. ప్రతి రోజూ టన్నుల కొద్దీ వస్తున్న చెత్తను ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి.. కొత్తగా ఏర్పడిన పురపాలక సంఘాల్లో అయితే రహదారుల పక్కనే పడేస్తున్నారు.. డంపింగ్‌ యార్డుల కోసం స్థలాలు ఎంపిక చేసినప్పటికీ స్థానికుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి.. దీంతో అందుబాటులో ఉన్న డంపింగ్‌ యార్డుల్లోని చెత్తను తగ్గించే దిశగా పురపాలక శాఖ కసరత్తు ప్రారంభించింది.

garbage reduction Exercise in karimnagar
కరీంనగర్​లో చెత్త తగ్గింపునకు కసరత్తు

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలోని డంపింగ్‌ యార్డు గుట్టలు గుట్టలుగా నిండింది. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు తోడు పెరిగిన ఇళ్లకు తగ్గట్లుగా చెత్త ఉత్పత్తి పెరిగింది. దీన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ప్రతి ఇంటి నుంచి సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. తీసుకొచ్చిన చెత్తను నిల్వ చేసేందుకు కూడా స్థలం లేకుండా మారింది. రోజుకు టన్నుల కొద్దీ చెత్త బయటకు వస్తుండటంతో నగరానికి ఇదే పెద్ద సమస్యగా మారింది.

‘తడి, పొడి’పై పెరిగిన అవగాహన

తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలన్న ప్రచారంతో ప్రజల్లో కొంతమేర అవగాహన పెరిగింది. ఇందుకోసం ఇదివరకే తడి, పొడి డబ్బాలు అందజేశారు. ఇంటి నుంచే చెత్తను వేరు చేసి ఇవ్వడంతో డంపింగ్‌ యార్డుకు వచ్చే చెత్త 10 శాతం తగ్గింది. నగరంలో ప్రతి రోజూ 5 మెట్రిక్‌ టన్నుల తడి చెత్తను రెండు వర్మీ కంపోస్టు యార్డులకు తరలిస్తున్నారు. పొడి చెత్తను డీఆర్‌సీసీ కేంద్రానికి పంపిస్తున్నారు. పొడి చెత్తలో పనికి రాని వస్తువులు సేకరించి రీసైక్లింగ్‌కు పంపించడం, మిగతా పొడి చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలిస్తుండటంతో 15 మెట్రిక్‌ టన్నుల మేర తగ్గింది.

నిల్వల తగ్గింపునకు సర్వే

ప్రస్తుత డంపింగ్‌ యార్డులో చెత్తను తగ్గించడం కోసం బయోమైనింగ్‌ కోసం పలుమార్లు పరిశీలించారు. సదరు సంస్థ యార్డును సందర్శించి ఎంత లోతులో చెత్త ఉందనే విషయాన్ని ఆరా తీసి వివరాలు నమోదు చేసుకుంది. ఈ వివరాలను గత పాలనాధికారికి కూడా అందించినట్లు సమాచారం. ఉన్న స్థలంలోనే చెత్తను తగ్గించడం కోసం అధికారులు అంచనాలు రూపొందించారు. కాగా స్మార్ట్‌సిటీ పథకంలో రూ.10 కోట్ల నిధులు కూడా కేటాయించారు.

కరీంనగర్‌లో బయో మైనింగ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌

చెత్తను ప్రాసెస్‌ చేసి ఘన వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపే దిశగా పురపాలక శాఖ చర్యలు ప్రారంభించింది. కరీంనగర్‌లోని డంపింగ్‌ యార్డు పరిస్థితిపై ఇప్పటికే జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఘన వ్యర్థాలను నిర్వహించేలా బయోమైనింగ్‌ ప్రక్రియను అనుసరించేందుకు రాష్ట్ర స్థాయిలో టెండర్లు కూడా పూర్తి చేసింది. కరీంనగర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం 11 క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఆయా సంస్థలు క్లస్టర్లను ఏర్పాటు చేసుకొని చెత్త తగ్గించే ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది.

ప్రమాదకరంగా డంపింగ్‌ యార్డు

ఏళ్ల తరబడి చెత్తను తీసుకొచ్చి డంపింగ్‌ యార్డులో పడేస్తున్నారు. నిల్వ ఉన్న చెత్తను పొక్లెయిన్‌తో జరుపుకుంటూ కొత్తగా వచ్చిన చెత్తను పోస్తున్నారు. దీంతో క్రమంగా గుట్టలు గుట్టలుగా పెరిగిపోయి ప్రమాదకర పరిస్థితికి చేరింది. ఫలితంగా ఏటా వేసవిలో మంటలు లేవడం, నగరాన్ని పొగ కమ్ముకోవడం, సమీప ప్రాంతాల ప్రజలకు గాలి కాలుష్యం ఏర్పడుతుండటం పరిపాటిగా మారింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.